NICL లో 500 అసిస్టెంట్ పోస్టులు.. ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే?
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 500 పోస్టులకు నియామకాలు చేపట్టనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ పై ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://nationalinsurance.nic.co.in/recruitment ని విజిట్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా, ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 11, 2024 వరకు అవకాశం ఇచ్చారు.
NICL అసిస్టెంట్ ఇవి ముఖ్యమైన తేదీలు
- NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ – అక్టోబర్ 24, 2024గా ఉంది.
- NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ – నవంబర్ 11, 2024 గా నిర్ణయించారు.
- NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ – 11 నవంబర్ 2024 NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం NICL మొదటి దశ పరీక్ష – 30 నవంబర్, 2024గా ఉంది.
- NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం దశ II- 28 డిసెంబర్ 2024న ఉంటుంది.
NICL అసిస్టెంట్ ఖాళీల వివరాలు
NICL ఈ ఖాళీ ద్వారా మొత్తం 500 పోస్టులను రిక్రూట్ చేస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దీని కోసం అభ్యర్థులకు వారి స్థానిక భాష వచ్చి ఉండాలి. అభ్యర్థులు ఒకేసారి ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకవేళ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో దరఖాస్తు చేసి ఉంటె దరఖాస్తు తీరకరిస్తారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం సులభమైన దశలు క్రింద ఇచ్చారు. వీటిని అనుసరించడం ద్వారా అభ్యర్థులు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
NICL అసిస్టెంట్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి
- అన్నింటిలో మొదటిది అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి అనగా Nationalinsurance.nic.co.in. కి వెళ్ళాలి.
- ఇప్పుడు హోమ్‌పేజీలో రిక్రూట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేయండి. మిమ్మల్ని మీరు నమోదు చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో వర్తించు లింక్‌పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫారమ్ ప్రదర్శించబడుతుంది.
3.కాగా, ఇప్పుడు నమోదు చేసిన ప్రక్రియను పూర్తి చేయడానికి వివరాలను నమోదు చేయాలి. అనగా పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య మొదలైనవి అని అర్థం. - రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి “క్రాస్ చెక్ అండ్ క్రియేట్ అకౌంట్” బటన్‌పై క్లిక్ చేయండి. NICL అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత, NICL అసిస్టెంట్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి నమోదు చేసుకున్న దరఖాస్తుదారులందరూ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే వివరాలను పూరించాలి.
- ఇప్పుడు NICL అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత నమోదు చేసుకున్న దరఖాస్తుదారులందరూ NICL అసిస్టెంట్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి చెల్లుబాటు అయ్యే వివరాలను పూరించాలి