రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకంలో పెట్టుబడి మొత్తం రేటింపు అవుతుంది!
పెట్టుబడి విషయానికి వస్తే.. సురక్షితమైన పెట్టుబడి ఎంపికలలో FD (ఫిక్స్డ్ డిపాజిట్-FD)కి మొదటి ప్రాధాన్యత ఇవ్వొచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు సురక్షిత పెట్టుబడి ఎంపికలో పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్ కూడా ఉంది. ఇందులో సెక్యూరిటీతో పాటు గ్యారెంటీ రిటర్న్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు అధిక వడ్డీని ఇచ్చే సురక్షిత పెట్టుబడితో కూడిన పథకం కోసం కూడా చూస్తున్నట్లయితే.. మీరు ఒకసారి కిసాన్ వికాస్ పత్రపై ఒకసారి చూడండి. ఈ పథకంలో పెట్టుబడి మొత్తం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.
అంటే మీరు ఈ పథకంలో రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ తర్వాత మీకు రెట్టింపు లాభం వస్తుంది అంటే రూ. 20 లక్షల మొత్తం వరకు వస్తుంది.
డబ్బు రెట్టింపు కావడానికి ఎంత సమయం?
ఈ పథకంలో డబ్బు 115 నెలల తర్వాత (9 సంవత్సరాలు, 7 నెలలు) రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం ఈ పథకంపై 7.5 శాతం వడ్డీ ఇస్తోంది. ఈ వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కించబడుతుంది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే? పెట్టుబడిదారుడు కేవలం రూ. 1000తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు. ఇది కాకుండా.. మీరు ఈ పథకం కోసం ఎన్ని బ్యాంకు ఖాతాలను అయినా తెరవవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర పథకం గురించి
ఈ పథకాన్ని 1988లో ప్రారంభించారు. రైతుల పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేయడమే ఈ పథకం లక్ష్యం. మొదట్లో ఈ పథకం రైతులకు మాత్రమే అయితే తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పుడు ఈ పథకంలో సింగిల్‌తో పాటు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. దీనితో పాటు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం కూడా ఖాతాను తెరవవచ్చు.
పిల్లల ఖాతాను తెరవడానికి తల్లిదండ్రులు ఆధార్ కార్డ్, వయస్సు సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, KYP ఫారమ్ మొదలైనవాటిని సమర్పించాలి. పిల్లల ఆధార్ కార్డుతో పాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డు కూడా సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకం భారతీయ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంది. కాగా, NRIలు ఈ పథకానికి అర్హులు కారు.