10th-ITI పాస్ అభ్యర్థులు సువర్ణావకాశం.. యంత్ర ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల దరఖాస్తు తేదీ పొడగింపు!!
నిరుద్యోగులకు శుభవార్త. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) ద్వారా ఐటీఐ, నాన్-ఐటీఐ పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 3883 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ నేపథ్యంలో దీని గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు
ఈ రిక్రూట్మెంట్లో చేరడానికి దరఖాస్తు చివరి తేదీ 21 నవంబర్ 2024గా నిర్ణయించింది. కాగా, దీని ఇప్పుడు December 30 వరకు పొడిగించారు. అటువంటి పరిస్థితిలో కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు పొడిగించిన తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్ సైట్
YIL yantraindia.co.in అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత
10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు/ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా.. సంబంధిత ట్రేడ్‌లో NCVT లేదా SCVT సర్టిఫికేట్ పొంది ఉండాలి. నాన్-ఐటిఐ పోస్టులకు దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు గణితం, సైన్స్‌లో కనీసం 40% మార్కులతో, మొత్తంగా కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు
ఈ రిక్రూట్మెంట్లో పాల్గొనడానికి అభ్యర్థి కనీస వయస్సు పోస్ట్ ప్రకారం 14/18 సంవత్సరాలుగా నిర్ణయించబడింది.
ఇలా దరఖాస్తు చేసుకోండి
ఈ రిక్రూట్మెంట్లో చేరడానికి అభ్యర్థులు స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో మీరు కేఫ్ నుండి అదనపు ఛార్జీలను కూడా నివారించవచ్చు.
- దరఖాస్తు చేసుకునేందుకు ముందుగా అధికారిక వెబ్సైట్ yantraindia.co.in ని విజిట్ చేయాలి.
- ముందుగా వెబ్సైట్ హోమ్ పేజీలోని కొత్త రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను పూరించడం ద్వారా నమోదు చేసుకోండి.
- దీని తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి లాగిన్‌పై క్లిక్ చేసి, ఇతర వివరాలను పూరించడం ద్వారా ఫారమ్‌ను పూర్తి చేయాలి.
- చివరగా, అభ్యర్థులు పూర్తిగా నింపిన ఫారమ్‌ను ప్రింటవుట్ తీసుకొని ముందు అవసరాలకు తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలి.
ఫీజు ఎంత ?
జనరల్, OBC కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు GST రుసుముతో పాటు రూ.200 చెల్లించాలి. ఇది కాకుండా.. SC, ST, మహిళలు, PWD, లింగమార్పిడి కేటగిరీ నుండి వచ్చే అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ 100 + GST రుసుమును డిపాజిట్ చేయాలి