ఈ ఒక్క పని చేస్తే చాలు.. జీరో కరెంటు బిల్లు వస్తుంది!!
ఈ ఒక్క పని చేస్తే చాలు.. జీరో కరెంటు బిల్లు వస్తుంది!!
పోయిన ఏడాదిలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఇందుకు ముఖ్య కారణం ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలే అని చెప్పవచ్చు
ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. దీంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి పెంచడం, గృహజ్యోతి పథకం ప్రారంభించడం చేసింది.
ఇక విషయానికి వస్తే ఇచ్చిన హామీలో భాగంగా గృహజ్యోతి పథకం ఒకటి. దీనిని పూర్తిగా ఉచితంగా అమలు చేసేందుకు ఏడాది మొదట్లో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది. అర్హులందరికీ జీరో కరెంటు బిల్ ఇచ్చేందుకు బిల్ మిషన్ లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి అర్హులందరికీ జీరో గ్రాండ్ బిల్ ఇస్తున్నారు.
అయితే, కొందరికి తెల్ల రేషన్ కార్డులు ఉన్న, ప్రజా పాలనలో దరఖాస్తులు ఇచ్చిన, జీరో కరెంట్ బిల్ కి అర్హత ఉన్నా కూడా.. జీరో కరెంట్ బిల్ రావడం లేదు. దీంతో ప్రజలు త్రీవ ఇబ్బంది పడుతున్నారు. కాగా ఇప్పుడు అలాంటివారు చిందించాల్సిన పనిలేదు. అలాంటివారికి విద్యుత్ సంస్థ తీపి వార్త చెప్పింది.
అదేంటంటే? ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నా, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న, అర్హులకు జీరో కరెంట్ రాకపోయినా వారందరూ సమీపంలో ఉన్న విద్యుత్ సంస్థ దగ్గరికి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఇందుకుగాను మండల పరిషత్, మున్సిపాల్, హెచ్ఎంసీ కార్యాలయాల్లోనూ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నారు. అయితే ఎవరైనా సరే 200 యూనిట్ల ఉచిత కరెంటుకు మించి విద్యుత్ వాడితే వారి నుంచి ప్రభుత్వం యధావిధిగా కరెంట్ బిల్ వసూలు చేస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతి గడపకు జీరో కరెంట్ బిల్ వస్తోంది. ఈ బిల్లులో కరెంటు వినియోగాన్ని చెబుతూనే కరెంట్ బిల్లును చూపిస్తోంది. అయితే జీజేయస్ జీరో అయినట్లు చూపిస్తోంది.