ఖాకీ డ్రెస్ వేసుకోవాలా? అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి!
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సబ్-ఇన్‌స్పెక్టర్ (SI), హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ఇటీవల ప్రకటించింది. ఎవరైనా ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యే వ్యక్తులు ఈ నోటిఫికేషన్ కి ప్రిపేర్ అవ్వొచ్చు. ఇది ఒక శుభవార్త అని కూడా చెప్పవచ్చు.
ముఖ్యమైన తేదీలు
ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ రేపటి నుండి అంటే నవంబర్ 15 నుండి ప్రారంభమవుతుంది. కాగా, దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 14 డిసెంబర్ 2024 వరకు కొనసాగుతుంది.
వెబ్ సైట్
ITBPలో చేరడం ద్వారా దేశానికి సేవ చేయాలనుకునే అభ్యర్థులు, ఈ రిక్రూట్‌మెంట్ కోసం అర్హతను పూర్తి చేయాలనుకుంటే.. వారు గడువు తేదీలలోపు ITBP recruitment.itbpolice.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
అర్హత
కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్) పోస్టులకు దరఖాస్తు చేయడానికి.. గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించాలి.
ఇక హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్స్) పోస్టుల కోసం అభ్యర్థి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో కనీసం 45 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.
ఇది కాకుండా.. SI (టెలికమ్యూనికేషన్) పోస్టుల కోసం అభ్యర్థి సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/కంప్యూటర్ అప్లికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ/సంబంధిత రంగంలో BE మొదలైనవాటిని పూర్తి చేసి ఉండాలి. కాగా, పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చూడవచ్చు.
వయోపరిమితి
సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇకపోతే చివరికి కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థి వయస్సు 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
నియామక వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 526 పోస్టులను నియమించనున్నారు. పోస్టుల వారీగా రిక్రూట్‌మెంట్ వివరాలను చూస్తే..
- సబ్-ఇన్‌స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్స్), మెయిల్: 78 పోస్టులు
- సబ్-ఇన్‌స్పెక్టర్ (టెలికమ్యూనికేషన్స్), స్త్రీ: 14 పోస్టులు
- హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్స్), మెయిల్: 325 పోస్టులు
- హెడ్ కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్స్), స్త్రీ: 58 పోస్టులు
- కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్స్), మెయిల్: 44 పోస్టులు
- కానిస్టేబుల్ (టెలికమ్యూనికేషన్స్), స్త్రీ: 7 పోస్టులు
దరఖాస్తు ప్రక్రియ
- ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి మీరు ముందుగా అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in కి వెళ్లాలి.
- వెబ్‌సైట్ హోమ్ పేజీలో మీరు కొత్త వినియోగదారు నమోదు లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను పూరించాలి.
- దీని తర్వాత లాగిన్ బటన్‌పై క్లిక్ చేసి, ఇతర సమాచారాన్ని పూరించాలి.
- చివరగా, అభ్యర్థులు పూర్తిగా నింపిన ఫారమ్‌ను ప్రింటవుట్ తీసుకొని తమ వద్ద భద్రంగా ఉంచుకోవాలి.