దీపావళి ధమాకా..కేవలం రూ.699కే 4G ఫోన్..
పండుగల సీజన్‌లో ఏ కంపెనీ అయినా తమ కస్టమర్‌లకు ఉత్తమమైన ఆఫర్‌లను అందించడానికి ప్రయత్నిస్తాయి. ఇందులో భాగంగా రిలయన్స్ ఎల్లప్పుడు ముందుంటుంది. ఈ క్రమంలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కూడా జియో భారత్ దీపావళి ధమాకా ప్రకటించింది. దీని కింద మీరు JioBharat 4G ఫోన్‌ను కేవలం 699 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. ఎక్కువ ఖర్చు లేకుండా 2G ఫీచర్ ఫోన్ నుండి 4G ఫీచర్ ఫోన్‌కి మారాలనుకునే వారికి ఇది శుభవార్త.
ఈ ఆఫర్ నిర్దిష్ట సమయానికి మాత్రమే అని, సమయం ముగిసిన తర్వాత పరికరం పాత ధరకే విక్రయించబడుతుందని కంపెనీ తెలిసుపింది. కాగా, మీరు ఈ ఫోన్‌ను ఎలా కొనుగోలు చేయాలి, దానిలోని ప్రత్యేకత ఏమిటి మనం ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
JioBharat 4G ధర
ముందుగా ధర గురించి మాట్లాడితే..Jio ఈ 4G ఫోన్‌ను కేవలం రూ. 699కే జాబితా చేసింది. దీపావళి ధమాకా కింద ఈ ఆఫర్ ఇస్తోంది. ఇది పరిమిత ఆఫర్ అని, ఇందులో రూ.999 విలువైన ఫోన్ ను రూ.699 ప్రత్యేక ధరతో కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఈ 4G ఫోన్ కోసం కంపెనీ ప్రత్యేక నెలవారీ ప్లాన్‌ను తీసుకువస్తుంది. కాగా, దీని ధర రూ. 123 గా ఉంది. ఈ ప్లాన్ కింద అనేక ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వబడతాయి. ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాల్స్, 14 GB డేటా, 455 + లైవ్ టీవీ ఛానెల్‌లు, సినిమా ప్రీమియర్లు, JioCinema యాక్సెస్ పొందొచ్చు. ఇది కాకుండా..ఈ ఫోన్ QR కోడ్ స్కాన్‌తో డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి, బదిలీ చేయడానికి సదుపాయాన్ని కలిగి ఉంది. JioChat ఎంపిక కూడా ఇందులో అందించబడింది. దీని ద్వారా మీరు వీడియోలు, ఫోటోలు, సందేశాలను కూడా పంచుకోవచ్చు.
రిలయన్స్ జియో దీపావళి ధమాకా
ఈ ఆఫర్ కింద రిలయన్స్ జియో అనేక గొప్ప ఆఫర్లను ప్రకటించింది. దీని కింద ఎంచుకున్న ప్లాన్‌లతో రీఛార్జ్ చేస్తే మీరు EaseMyTrip, Ajio, Swiggy నుండి వోచర్‌లు, ఆఫర్‌లను పొందొచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 26 నుండి నవంబర్ 5, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది. కాగా, మీరు Jio.com, MyJio యాప్ నుండి దీనిని ఉపయోగించవచ్చు.
మీరు Jio True 5Gని రూ. 899, రూ. 3,599 నుండి రీఛార్జ్ చేయడం ద్వారా రూ. 3,350 ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందులో మీరు EaseMyTrip నుండి రూ. 3,000 వోచర్, Ajioలో రూ. 200 కూపన్, Swiggy నుండి రూ. 150 వోచర్ పొందవచ్చు