గుడ్ న్యూస్ చెప్పిన అంబానీ మామ..ఈ రీఛార్జ్ చేసుకుంటే రూ. 3,350 మీ సొంతం!
దీపావళి ఇంకా కొన్నిరోజుల్లో రాబోతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్ ఆపరేటర్లలో ఒకటైన రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీంతో మరోసారి ముఖేష్ అంబానీ కోట్లాది మంది జియో వినియోగదారులకు ప్రత్యేక దీపావళి బహుమతిని అందించారు. పండుగ ఆఫర్‌లో భాగంగా..Jio Ajio, EaseMyTrip, Swiggy వినియోగదారులకు 3,350 రూపాయల విలువైన ఉచిత వోచర్‌లు, డిస్కౌంట్ కూపన్‌లను అందిస్తోంది. దీపావళి ధమాకా ఆఫర్‌ను పొందేందుకు..వినియోగదారులు రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. ఇది ప్రతిరోజూ అపరిమిత 5G, 2GB 4G డేటాతో పాటు 20GB అదనపు డేటాను అందిస్తుంది.
జియో యాప్‌లకు యాక్సెస్
ఈ ఆఫర్ రూ. 3,599 వార్షిక ప్లాన్‌పై కూడా వర్తిస్తుంది. ఇందులో అపరిమిత 5G, 2.5GB 4G మొబైల్ డేటా ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే మీరు కూడా అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలను పొందుతారు. రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లు JioTV, JioCinema,JioCloudతో సహా Jio యాప్‌లకు యాక్సెస్‌తో వస్తాయి.
ఎలాంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి..
జియో వెబ్‌సైట్ ప్రకారం..రూ. 899, రూ. 3,599 ప్రీపెయిడ్ ప్లాన్‌లతో జియో అజియో నుండి రూ. 999 ఆర్డర్‌లపై రూ. 200 తగ్గింపు, EaseMyTrip వెబ్‌సైట్ నుండి విమాన, హోటల్ బుకింగ్‌లపై రూ. 3,000 వరకు తగ్గింపు, Swiggy నుండి ఆర్డర్‌లపై రూ. 300 తగ్గింపు ఉంది. దీపావళికి ముందు ఈ ఆఫర్ చాలా ప్రత్యేకమైనది. ఇది మీకు రీఛార్జ్‌తో రెట్టింపు ప్రయోజనాన్ని అందిస్తోంది.
ఉచిత కూపన్‌ను ఎలా క్లెయిమ్ చేయాలి?
మీరు MyJio యాప్ నుండి ఈ కూపన్‌లను క్లెయిమ్ చేసుకోవచ్చు. “ఆఫర్‌లు” విభాగంలోని “My Winnings” ఎంపికకు వెళ్లడం ద్వారా Reliance Jio చెప్పింది. మీరు చేయాల్సిందల్లా కూపన్ కోడ్‌ను కాపీ చేసి వెబ్‌సైట్‌లో ఉపయోగించడం. నవంబర్ 5 వరకు మీరు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు. కాబట్టి పేర్కొన్న తేదీ కంటే ముందే మీ SIM కార్డ్‌ని రీఛార్జ్ చేసుకోండి. లేకపోతే మీరు ఈ ఆఫర్‌ను పొందలేరు