మీకు బ్యాంకులో పని ఉందా?.. అయితే ఈ వార్త మీ కోసమే!
భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశంలో ఉన్న అన్ని బ్యాంకులకు వార్షిక సెలవులు, పండుగలు, ప్రాంతీయ ఈవెంట్లు, జాతీయ సెలవులు, ప్రామాణిక వారాంతపు మూసివేతలకు సంబంధించి.. వార్షిక జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. దీంతో ప్రజలందరూ ఎప్పుడు బ్యాంక్ తెరిచి ఉంటుందో, ఎప్పుడు మూసేయబడుతుందో తెలుస్తుంది. దీంతో వారి సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
మీకు బ్యాంకులో పని ఉందా?.. అయితే ఈ వార్త మీ కోసమే. రాబోయే రోజుల్లో దేశమంతటా ఉన్న బ్యాంకులకు సెలవులు రానున్నాయి. అక్టోబర్ నెలలో వరుసగా బ్యాంకుకు సెలవులు వస్తున్నాయి. బ్యాంకులకు తాళం పడనుంది. అయితే బ్యాంకులకు ఎప్పుడు సెలవు ఉంటుందని తెలుసుకోవాలంటే ఈ తేదీలను గుర్తు పెట్టుకోవాల్సిందే.
లిస్టు ప్రకారంగా బ్యాంకుల సెలవులు చూస్తే..
1. అక్టోబర్ 10: ఈ తేదీన దుర్గాపూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. దేశంలోని అగర్తలా, గువహాటీ, కొహీమా, కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది. మరోవైపు..తెలంగాణ రాష్ట్రంలో కూడా సద్దుల బతుకమ్మ నేపథ్యంలో సెలవు ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వానికి కోరుతున్నారు.
2.అక్టోబర్ 11: ఈ తేదీన దసరా పండగ, ఆయుధపూజ నేపథ్యంలో దేశంలోనే పలు నగరాల్లో అనగా అగర్తలా, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గువహటీ, ఇంపాల్, ఈటా నగర్, కోల్‌కతా, కొహీమా, రాంచీ, షిల్లాంగ్, పాట్నా ప్రాంతాల్లో బ్యాంకులకు ఉంటుంది.
3.అక్టోబర్ 12: తేదీన తేదీ దసరా/దసరా (మహానవమి/విజయదశమి)/దుర్గా పూజ (దసైన్) అలాగే రెండవ శనివారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉండనుంది.
4.అక్టోబర్ 13: ఈ తేదీన ఆదివారం కావడంతో దేశమంతటా ఉన్న అన్ని పబ్లిక్, ప్రైవేటు రంగ బ్యాంకులకు తాళం పడనుంది. అదేవిధంగా 14వ తేదీన కూడా కొన్ని ప్రాంతాల్లో దుర్గాపూజ సందర్భంగా ఆయా ఏరియాల్లో బ్యాంకులు బంద్ కానున్నాయి.
అయితే, భారతీయ రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన బ్యాంక్ సెలవుల జాబితా ప్రకారమే పైన పేర్కొన్న తేదీలో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకు అనేది లావాదేవీల విషయంలో చాలా ముఖ్యమైనది. కావున ప్రతి ఒక్కరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసే బ్యాంకుల సెలవుల జాబితాను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూనే ఉండాలి. దీంతో మీకు బ్యాంకు సెలవులపై అవగాహన పెరుగుతుంది. దీంతో మీ సమయాన్ని కూడా ఆధార్ చేసుకోవచ్చు.