SSC లో భారీ ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసుకోండి..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
SSC లో భారీ ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసుకోండి..లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs)లో కానిస్టేబుల్ (GD), అస్సాం రైఫిల్స్‌లో SSF, రైఫిల్‌మ్యాన్ (GD), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో కానిస్టేబుల్ పోస్టుల కోసం 39481 ఉద్యోగాల కోసం రిక్రూట్‌మెంట్‌ను ఇటీవల ప్రకటించింది.
ఈ నేపథ్యంలో దేశంలోని లక్షలాది మంది అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో, రిజిస్ట్రేషన్ చివరి రోజుల్లో వెబ్‌సైట్ చాలాసార్లు సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఆసక్తిగల, అర్హత గల అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inని సందర్శించడం ద్వారా ఎటువంటి ఆలస్యం లేకుండా ఫారమ్‌ను పూరించవచ్చు.
దీనితో పాటు..మీ సౌలభ్యం కోసం లింక్ ఈ పేజీలో అందుబాటులో ఉంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు ఫారమ్‌ను పూరించవచ్చు. కాగా, రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ అక్టోబర్ 14 వరకు ఉంది. ఇక ఫీజు డిపాజిట్ చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 15 వరకు అవకాశం ఇచ్చారు.
10వ తరగతి పాసైన అభ్యర్థులకు సువర్ణావకాశం
ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ/మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు.. అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. కాగా, గరిష్ట వయస్సు 23 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఇకపోతే ST/SC కేటగిరీ నుండి వచ్చే అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC కేటగిరీ నుండి వచ్చే అభ్యర్థులకు 3 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇవ్వబడుతుంది. అయితే ఈ మొటిఫికేషన్ కు 1 జనవరి 2025ని దృష్టిలో ఉంచుకుని వయస్సు లెక్కించబడుతుంది.
అప్లికేషన్ చేసుకునే ప్రక్రియ ఇదే
1. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి, ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళండి.
2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో మీరు దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయాలి.
3. దీని తర్వాత రిజిస్టర్ నౌపై క్లిక్ చేసి అవసరమైన వివరాలను పూరించి, నమోదు చేసుకోండి.
4. ఇప్పుడు లాగిన్ ద్వారా ఇతర వివరాలు, సంతకం, ఫోటో మొదలైన వాటిని అప్‌లోడ్ చేయడం ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి.
5. చివరగా, అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తు రుసుము
SSC GD రిక్రూట్‌మెంట్ 2025 కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు జనరల్, OBC, EWS కేటగిరీలు మొత్తం రూ. 100 చెల్లించాలి. దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈ-చలాన్ ద్వారా జమ చేయవచ్చు. కాగా SC, ST మహిళా కేటగిరీలు ఫారమ్ నింపడంతో పాటు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కేటగిరీ అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.