మీ ఆధార్ కార్డ్ పోయిందా? రూపాయి ఖర్చు లేకుండా ఇలా దరఖాస్తు చేసుకోండి!
ఆధార్ కార్డు ఈరోజుల్లో మనలో ఒక భాగం అయిపోయింది. గుర్తింపు కార్డు నుంచి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకునే వరకు ఆధార్ కార్డు తప్పనిసరి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు పోయినా లేదా పాడైపోయినా, చాలా ముఖ్యమైన పనులు మనం చేసుకోలేము.
కానీ, ఇప్పుడు ఒకవేళ అలా జరిగితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఆధార్ కార్డ్ జారీ చేసే సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా ఆన్‌లైన్‌లో PVC ఆధార్‌ను సులభంగా ఆర్డర్ చేయవచ్చు.
PVC ఆధార్ కార్డ్ అంటే ఏమిటి?
పాలీ వినైల్ క్లోరైడ్ కార్డ్ (PVC) అనేది ప్లాస్టిక్ కార్డ్ లాగానే ఉంటుంది. ఇది ఒక మాదిరిగా పాన్ కార్డ్ లాగా ఉంటుంది. దానిపై ఆధార్ సమాచారం ముద్రించి ఉంటుంది. ఇది పాన్ లేదా డెబిట్ కార్డ్ వంటి మీ పర్స్‌లో సులభంగా సరిపోతుంది. కాగా, ఇది ఎక్కవ రోజులు ఉంటుంది.
PVC ఆధార్ కార్డ్ ను ఎలా ఆర్డర్ చేసుకోవాలి?
- ముందుగా UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
2.సైట్‌లో ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను పూరించాలి. Send OTPపై క్లిక్ చేయండి. - మీ రిజిస్టర్డ్ మొబైల్‌కి OTP వస్తుంది. దాన్ని పూరించి సమర్పించండి.
- అప్పుడు మీరు ‘ఆర్డర్ ఆధార్ PVC కార్డ్’పై క్లిక్ చేయాలి.
- మీరు మీ సమాచారాన్ని చూస్తారు. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI చెల్లింపు ఎంపికలను పొందుతారు.
- మీరు చెల్లింపు ఎంపికను ఎంచుకుని, రుసుము రూ. 50 డిపాజిట్ చేయాలి.
చెల్లింపు తర్వాత, ఆధార్ PVC కార్డ్ ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడు మీరు ఇంకేమీ చేయనవసరం లేదు. మీ సమాచారాన్ని తనిఖీ చేసిన తర్వాత, UIDAI ఆధార్‌ను ప్రింట్ చేసి 5 రోజుల్లోగా ఇండియా పోస్ట్‌కి అందజేస్తుంది. తపాలా శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి డెలివరీ చేస్తుంది.
ఆధార్ కార్డ్ 3 ఫార్మాట్‌లు
ఆధార్ కార్డ్ ప్రస్తుతం 3 ఫార్మాట్లలో అందుబాటులో ఉంది. ఆధార్ లేఖ, ఇ-ఆధార్, PVC కార్డ్. UIDAI ప్రకారం.. మార్కెట్లో తయారు చేయబడిన PVC కార్డులు చెల్లవు. UIDAI అక్టోబరు 2024లో పాలీ వినైల్ క్లోరైడ్ కార్డ్ (PVC)పై ఆధార్ కార్డ్‌ని రీప్రింట్ చేసే సదుపాయాన్ని అందించింది. మీరు ఆఫ్‌లైన్ ద్వారా తయారు చేసిన కొత్త ఆధార్ కార్డ్‌ని కూడా పొందవచ్చు. దీని కోసం మీరు సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి అక్కడ అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి.
దేని కోసం ఆధార్ అవసరం?
- పాన్ కార్డ్ అప్లికేషన్
- ఓటరు గుర్తింపు కార్డు దరఖాస్తు
- పాస్పోర్ట్ అప్లికేషన్
- రేషన్ కార్డు దరఖాస్తు
- ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందేందుకు
- బ్యాంకు ఖాతా తెరవడం
- రుణ దరఖాస్తు
- క్రెడిట్ కార్డ్ అప్లికేషన్
- డెబిట్ కార్డ్ అప్లికేషన్