త్వరలో 12వేల బ్యాంక్ ఉద్యోగాల భర్తీ!
SBI నుండి 12 వేల బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది.
కథనం: నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. త్వరలో 12వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఇటీవల ఆ సంస్థ ఛైర్మన్ దినేశ్ ఖారా చెప్పారు. ఇందులో 8వేల ఉద్యోగాలు ఇంజినీరింగ్ విద్యార్థులకే కేటాయించనున్నట్లు తెలిపారు. 3వేల మంది పీఓలు, 8 వేలమంది అసోసియేట్లకు బ్యాంకింగ్ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి నియమించుకోనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రిసిషన్ బయలతో ఐటీ సెక్టార్లో ఉద్యోగాల నియామకం కాస్త తగ్గడంతో ఫ్రెషర్లకు ఇది శుభవార్త అనే చెప్పవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అఫిషియల్ నోటిఫికేషన్ విడుదల అయ్యాక అందించబడును. కావున ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద ఇవ్వబడిన మా WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
ఈ పరీక్షలో విజయం సాధించాలంటే అర్థమెటిక్, రీజనింగ్ వంటి అంశాలపై పట్టు సాధిస్తే బ్యాంకు కొలువులు ఈజీగా సాధించవచ్చు. అయితే పరీక్షలో అర్థమెటిక్, రీజనింగ్ ప్రశ్నలకు సమాధానాలను వేగంగా గుర్తించాల్సి ఉంటుంది. అందుకు ప్రాక్టీస్ చాలా ముఖ్యం.
“బ్యాంక్ ఉద్యోగం సాధించాలనుకుంటే ఆ దిశగా ప్రిపేర్ కావడం, కోచింగ్ తీసుకోవడం వల్ల సక్సెస్ సాధించవచ్చు. “